- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ తెలంగాణాను అప్పుల పాలు చేశాడు : MLA Rajasingh
దిశ, ఎల్లారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల రూపాయలు అభివృద్ధి పేరిట నిధులు మంజూరు చేస్తే, పది సంవత్సరాల పాలల్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని ఎల్లారెడ్డి గాంధీ చౌక్ లో ఆయన మాట్లాడుతూ… రాముని మందిరం పై బీజేపీ పార్టీ ఓట్లు అడుగుతున్నదని, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విష్ణుమూర్తి గుడి కట్టి మీరు కూడా ఓట్లు అడుగవచ్చుని గోషామహల్ రాజాసింగ్ అన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని భారతదేశంలో అమెరికా లాంటి ప్రణాళికలు ఆలంబిస్తామని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో నరేంద్ర మోడీ ఎంతో అభివృద్ధి చేశారని మళ్ళీ ఈ ఎన్నికల్లో తప్పకుండా మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గెలుపొంది తీరుతారని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ,ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, జిల్లా భాజపా అధ్యక్షురాలు అరుణ తారా ,భారతీయ జనతా పార్టీ నాయకులు భత్తిని దేవేందర్ బాణాల లక్ష్మారెడ్డి నేరెళ్ళ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Rajasingh