పంట నష్టం జరిగితే నయా పైసా ఇవ్వని చరిత్ర కేసీఆర్‌ది

by Naresh |
పంట నష్టం జరిగితే నయా పైసా ఇవ్వని చరిత్ర కేసీఆర్‌ది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పంటల నష్ట పరిహారంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు. పంటల బీమా పథకాన్ని అమలు చేయకుండా రైతుల ఉసురు పోసుకున్నది బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ ఇప్పుడు పంట నష్టపరిహారం గురించి మాట్లాడటం హంతకులే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అన్వేష్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే నయా పైసా ఇచ్చిన పాపాన పోలే నాటి కేసీఆర్ ప్రభుత్వం అని ఆరోపించారు.

పంట నష్టం ఇప్పియ్యాలని రైతులు హైకోర్టు ఆశ్రయించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఉండేధని గుర్తు చేశారు. రూ. 7219 కోట్ల విలువైన పంట నష్టం జరిగింది అని హైకోర్ట్‌కి చెప్పిన కేసీఆర్ సర్కార్ దిగిపోయిన నాటికి పైసా ఇవ్వలేదు అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ. 1500 కోట్ల పంట నష్టాన్ని కూడా పంపిణీ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పంటల బీమా పథకం అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అకాల వర్షాలు వచ్చిన, వడగండ్లు పడిన, ప్రకృతి విపత్తులు వచ్చి పంటలు నాశనమైనా ఏనాడూ మీరు చెలించలేదు అని తెలిపారు. తొమ్మిదేళ్ల తర్వాత ఒకసారి కేసీఆర్ పంటలు పరిశీలించి నష్టపరిహారం ఇస్తున్నట్లు హడావిడి చేసిన... అతి కొద్దిమందికే ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు.

మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది మొదటి సారి నష్టం జరిగింది. అయినా మా ముఖ్యమంత్రి సర్వే చేయమని చిప్పిండు రూ. 10 వేలు ప్రకటన కూడా చేశారు అన్నారు. పంటల ఫసల్ బీమా యోజనలో తెలంగాణ ప్రభుత్వం చేరింది. వచ్చినా 90 రోజుల్లోనే ఆ పథకంలో చేరుతున్నట్లు వ్యవసాయ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారు. అది మా చిత్తశుద్ధి, మీ లాగా 9 సంవత్సరాలు పడుకొని హడావిడి చేసి అది కూడా పూర్తిగా ఇవ్వలేదు మీరా మాట్లాడేది అని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఎన్నికలు ఉంటే వర్ష బాధితులకు డబ్బులు ఇచ్చారు. అదే సమయంలో పంట నష్టపోతే ఎందుకు ఇవ్వలేదు. రైతుబంధు చైర్మన్ గా అప్పుడున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అన్నారు. రైతులకు పంట నష్టం ఇవ్వాలని హైకోర్టు చెప్పితే ఇవ్వకుండా సుప్రీం కోర్టుకు వెళ్లి తప్పించుకున్న మీరు కూడా మట్లాడడమా అని ఎద్దేవా చేశారు.

మీ హయాంలో వర్షాలు పడి పంటలు నష్టపోతే ఎక్కడికి కూడా మీరు వెళ్ళలేదు. ఆనాడు ఏడ పడుకున్నావు పల్లా అని అన్వేష్ రెడ్డి ప్రశ్నించారు. లక్ష రూపాయల రుణమాఫీ పథకం అమలు చేయకుండా రైతుల ఉసురు పోసుకుంది బీఆర్ఎస్. రైతులంతా బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారు. ప్రైవేటు అప్పులపై ఆధారపడుతున్నారు దానికి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమన్నారు. రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. రైతులకు భరోసా ఇచ్చారు. ఎకరానికి రూ. 10 వేల నష్టపరిహారం ఇస్తామని మా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పంట నష్టం పై సర్వే చేస్తున్నారు. అప్పుడే మీకు కడుపు మంట దేనికి. పంట నష్టపోయిన రైతులకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపించటం దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా. ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండని అన్నారు. రైతుల కోసం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. మీలాగా రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టే ప్రభుత్వం మాది కాదు అన్నారు. ఈ పత్రిక సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పా గంగారెడ్డి, సిరికొండ గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అల్లూరి మహేందర్ రెడ్డి, కిసాన్ సెల్ శశిధర్ రెడ్డి, సుంకేట్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed