చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో కామారెడ్డిదే ప్రథమ స్థానం

by Sridhar Babu |
చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో కామారెడ్డిదే ప్రథమ స్థానం
X

దిశ, కామారెడ్డి : చోరీకి గురైన సెల్ ఫోన్ లను రికవరీ చేయడంలో రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. రాష్ట్రంలో లో సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ లో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో పడిపోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల యజమానులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఈ విషయంలో సీఈఐఆర్ అప్లికేషన్ లో పోయిన మొబైల్ ఫోన్ లను నమోదు చేయగా ఇప్పటికే

1053 రికవరీ చేసి బాదితులకు అందచేయడం జరిగిందన్నారు. బాన్సువాడ సబ్ డివిజన్లో 442, కామారెడ్డి సబ్ డివిజన్లో 398, ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో 213 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు తెలిపారు. జిల్లాలో సెల్ ఫోన్ రికవరీ లో బాన్సువాడ పోలీసు స్టేషన్ మొదటి స్థానంలో, కామారెడ్డి రెండవ స్థానంలో ఉన్నాయన్నారు. ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ లో తెలియజేసి సీఈఐఆర్ అప్లికేషన్ లో నమోదు చేసుకోవాలన్నారు. సెల్ ఫోన్ రికవరీ కి కృషి చేసిన సిబ్బందిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story