కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి.. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

by Sumithra |
కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి.. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
X

దిశ, కామారెడ్డి : కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ, ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ రాజారాం, డీవైఎస్ఓ జగన్నాథం, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

కళాకారుల సంఘం ఆధ్వర్యంలో..

జిల్లా కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సొంటెం సాయిలు, కళాకారులు వడ్ల వెంకన్న, కత్తూర్ కిషన్, రెడ్డి రాజయ్య, ఎదురుగట్ల శంకర్ గౌడ్, పోచయ్య, దేవరాజ్, పల్లె నర్సింలు, సుంకరి శ్రీనివాస్, నర్సింలు, డప్పు స్వామి, అన్యబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed