- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Thota Lakshmikanta Rao : ఎడ్యుకేషనల్ హబ్ గా జుక్కల్ నియోజకవర్గం
దిశ,నిజాంసాగర్: గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు భాగంగా.. జుక్కల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు( MLA Thota Lakshmikanta Rao )తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే బిచ్కుంద మండల కేంద్రంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేస్తున్న ITI కళాశాలను సందర్శించారు. నూతన టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేసేందుకు కావలసిన అధునాతన సాంకేతిక పరికరాలను ఆయన పరిశీలించి ,అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిచ్కుంద ITI కాలేజ్ ను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేస్తున్నారని,రాష్ట్ర వ్యాప్తంగా 25 ITI కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్ గ్రేడ్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లాలో కేవలం ఒక్క బిచ్కుంద ITI కళాశాలకు మాత్రమే ఈ అవకాశం రావడం పట్ల ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్ గ్రేడ్ చేసిన ITI కళాశాలలో కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగం,ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నారు. పదో తరగతి పాసైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే కోరారు.