కాపులను గుర్తించింది బీజేపీనే

by Sridhar Babu |
కాపులను గుర్తించింది బీజేపీనే
X

దిశ, నిజామాబాద్ సిటీ : కాపులను గుర్తించింది బీజేపీనే అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అసలైన కాపు బిడ్డ నరేంద్ర మోడీఅని, అభినవ శివాజీ నరేంద్ర మోడీ అని ఒక్క పైసా అవినీతి లేకుండా దేశంలో మోడీ, ఇందూర్ గడ్డపై ధర్మపురి అరవింద్ చిర స్థాయిలో నిలిచి ఉంటామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా జిల్లా మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం, దినేష్ పటేల్ కులచారి కి సన్మానం కార్యక్రమం జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ధర్మపురి అరవింద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ ఎన్నికల్లో 49 వేల ఓట్లు సాధించి దినేష్ పటేల్ కులచారి సత్తా చాటారని, అసెంబ్లీ టికెట్ కోసం తాను సిఫారసు చేస్తే అనంతరం దినేష్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమించామని చెప్పడం జరిగిందంటే ఎలక్షన్ లో ఆయన చేసిన కృషి అలాంటిదని అన్నారు.

దినేష్ పటేల్ మరెన్నో పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. మున్నూరు కాపులు నిజామాబాద్ లో చాలామంది కార్పొరేటర్లుగా ఉన్నారని, మున్నూరు కాపులు ఐక్యతతో ఉంటే ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ప్రపంచ దేశాల్లో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీసుకెళ్లనున్నట్లు మోడీ చెబుతున్నారని, మోడీ చేస్తున్న పట్టుదల కృషిని చూస్తుంటే మొదటి బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారనుందని అన్నారు. నిజామాబాద్లో 40 సంవత్సారాలు నుంచి రైతుల కడుపు మంట తీర్చిన తాను చరిత్రలో నిలుస్తానని, ఈ విషయం సంతోషాన్నిస్తుందన్నారు. పసుపు బోర్డు కలను నెరవేర్చిన ఘనత మోడీ ప్రభుత్వానిదే అన్నారు. పసుపు కు 14,500 ధర పలుకుతుందని రానున్న కాలంలో 20 వేలకు పైగా ఉండబోతుందని అన్నారు. వరి, చెరుకు కోసం మద్దతు ధర పెంచుతున్నామని, రైతుకు మద్దతు ధర వస్తుందంటే మోడీ చలువే అన్నారు.

నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి గా ఉండడం వల్లనే ఈనాడు ఐదు వందల ఏళ్ల నాటి అయోధ్య కల నెరవేరిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 30 శాతం ఓటింగ్ శాతం పెంచడం కోసం కృషి చేసి తనకు మోడీ, అమిత్ షా ప్రశంసలు లభించాయన్నారు. నిజామాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో ప్రేమ, అభిమానం ఉందని, నిజామాబాద్ తల్లి వేరు లాంటిదని మా తండ్రి చెప్పే వారని అన్నారు. జిల్లా కు కోట్లాది రూపాయలు నిధులు ఇవ్వడం జరిగిందని అన్నారు. అన్ని కుల సంఘాలతో పాటు మున్నూరు కాపు సంఘాలకు నిధులు ఇచ్చినట్లు తెలిపారు. నిజామాబాదులో రైల్వే బ్రిడ్జ్ లకు నిధులు తీసుకురానున్నట్టు తెలిపారు. మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించుకోనున్నామని గుర్తు చేశారు. ధర్మం కోసం పనిచేసే వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంఘం అభివృద్ధి కోసం పాటుపడతామని గ్రామ గ్రామానికి నిధులు కేటాయిస్తామని అన్నారు. దినేష్ పటేల్ కుల చారి మాట్లాడుతూ..

తన మీద నమ్మకంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన పార్టీ కి, నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. తనకు సన్మానం చేయాలని పదిహేను రోజులుగా కుల సంఘాల పెద్దలు కలవడం జరుగుతుందని, ఈరోజు ఇంత ఘనంగా సన్మానం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. మనమందరం సంఘటితం కావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అనంతరం వివిధ తర్పల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు ఎంపీ అరవింద్, దినేష్ పటేల్ కులచారిని శాలువా, పూలమాలతో సత్కరించారు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన పేరిణి నాట్య కళాకారుడు రాజేష్ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా మున్నూరు కాపు సంఘం కోశాధికారి ధర్మపురి సురేందర్, కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు, ప్రవలిక శ్రీధర్, బంటు వైష్ణవి రాము , పంచరెడ్డి లావణ్య లింగం, బీజేపీ నాయకులు నోగొల్ల లక్ష్మి నారాయణ, పంచ ముఖి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు హరిదాసు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంతోష్ కులచారి, దర్పల్లి కర్క గంగారెడ్డి, నాయిడి రాజన్న పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed