- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెన్షనర్ల కుటుంబ ఆత్మయ సమ్మేళనం..
దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, పెన్షనర్ల కుటుంబ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని న్యూ అంబేద్కర్ భవన్ లో జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ విద్యావేత్త, రచయిత, విజయ్ విద్యాసంస్థల చైర్పర్సన్ డాక్టర్ అమృతలత విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా శక్తి ఎంతో ఉన్నతమైందని మహిళలు తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదని అన్నారు. దేశ విదేశాలలో అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని, ఏలాంటి సమస్యలు వచ్చినా ఓపికతో అధిగమించే శక్తి మహిళల్లోనే ఉంటుందని అన్నారు.
మహిళ ఇంటినే కాదు సమాజాన్ని కూడా చక్కదిద్దుతుందని అన్నారు. మహిళా చదువు ఇంటికే కాదు సమాజానికి వెలుగును అందిస్తుందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతిసంవత్సరం పెన్షనర్ల కుటుంబ సమ్మేళనంతో పాటు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. వివిధ రంగాలలో ఉన్నతంగా ఎదిగిన, పెన్షనర్స్ కుటుంబ మహిళలకు సన్మానాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రఉపాధ్యక్షురాలు డాక్టర్ లింగ అరుణ, బోధన్ మండల గౌరవ అధ్యక్షురాలు సరోజనమ్మ, అవయవదాన రాష్ట్ర అధ్యక్షులు కాట్రగడ్డ భారతి, నిర్మలమ్మ, మేరీ, సుగుణ భాయ్, జిల్లా పెన్షనర్స్ హాజరయ్యారు.