- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇన్ చార్జి సీపీ వార్నింగ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దిశ దినపత్రికలో వరుసగా నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారుల అవినితి, వసూళ్లపై వచ్చిన కథనాలపై ఇన్ చార్జి పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ అధికారులకు క్లాస్ పికినట్లు తెలిసింది. తీరు మారకపోతే వేటు తప్పదంటూ ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. తాను బాస్ గా ఉన్న టాస్క్ ఫోర్స్ పై అవినీతి, బలవంతపు వసూళ్ల అరోపణలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
గత రెండు రోజులుగా దిశ దిన పత్రికలో టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో జరిగిన బలవంతపు వసూళ్లపై విచారించినట్లు సమాచారం. నిఘా వర్గాల ద్వారా ఓ అధికారి ద్వారా టాస్క్ ఫోర్స్ కు చెడ్డపేరు రావడం ఇష్టం లేదని హెచ్చిరించి వదిలేసినట్లు తెలిసింది. ఇలాంటి అరోపణలు పునరావృతం అయితే.. సమగ్ర విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ పోలీసులకు సీపీ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహరం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.