అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీజ్

by Sridhar Babu |
అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీజ్
X

దిశ, కామారెడ్డి : అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన మద్యాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సింధు తెలిపారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా మద్యం నిలువ ఉంచారనే సమాచారం మేరకు దేవునిపల్లి ఎస్సై రాజు తన సిబ్బందితో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి కి సంబంధించిన అధికారులు చిన్న మల్లారెడ్డి గ్రామానికి వెళ్లి బాణాల చిన్న పెద్దులు అనే వ్యక్తి ఇంటిలో తనిఖీ చేశారు. దాంతో రాయల్ స్టాగ్ 1656 క్వార్టర్ బాటిళ్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 3 లక్షల 26 వేల 370 ఉంటుందని తెలిపారు. ఈ మద్యాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం లక్ష్మి నరసింహ వైన్స్ నుండి కొనుగోలు చేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. మద్యాన్ని అక్రమంగా నిల్వవ ఉంచిన బాణాల చిన్న పెద్దులు తో పాటు మద్యాన్ని అమ్మిన వైన్స్ యజమాని పై కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed