- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ ప్రారంభమైన అక్రమ ఇసుక వ్యాపారం..
దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక వ్యాపారం మళ్ళీ ప్రారంభమైంది. వరుస ప్రమాదాలతో కొన్నాళ్ల పాటు నిశ్శబ్దంగా ఉన్న ఇసుక అక్రమార్కులు మళ్లీ పుంజుకున్నారు. రాత్రి అయింది మొదలు తెల్లవారుజాము వరకు దర్జాగా ఇసుకాసురులు అక్రమ ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
అక్రమార్కులకు అండగా మండల స్థాయి ఓ అధికారి వారికి వెన్నుదన్నుగా ఉండడంతోనే అక్రమ ఇసుక వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక వ్యాపారుల పై చర్యలు తీసుకుంటారా ? లేదా వదిలేస్తారా ? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది జోక్యంతో క్వారీల వద్ద వీఆర్ఏల పహార నిర్వహించగా కొంతకాలం ఆగిన అక్రమ ఇసుక వ్యాపారం మళ్లీ ప్రారంభం కావడంతో పలుఅనుమానాలకు తావిస్తోంది అంటూ పలువురు గుసగుసలాడుకుంటున్నారు.