పింఛన్లు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.. అర్హులందరికీ ఇస్తాం: Narasimha Reddy

by Mahesh |   ( Updated:2022-09-02 14:50:57.0  )
పింఛన్లు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.. అర్హులందరికీ ఇస్తాం: Narasimha Reddy
X

దిశ, భిక్కనూరు: ఈ నెల 5న నిజామాబాద్ పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్ సభకు మూడు వేల మంది పార్టీ శ్రేణులను తీసుకెళ్తున్నట్లు ఆత్మ కమిటీ చైర్మన్, మండల టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ పెద్ద బచ్చగారి నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశానుసారం 55 బస్సులలో పార్టీ శ్రేణులను ప్రజా ప్రతినిధులను మండలం నుంచి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. మండలం లో కొత్తగా 1551 పింఛన్ల గుర్తింపు కార్డులను పంపిణీ చేయడం పూర్తయిందన్నారు.

కొత్త పింఛన్ల లిస్టులో చోటు దక్కని వారు ఏ మాత్రం బాధ పడవద్దని, వారందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అధ్యక్షుడు జాo గారి గాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ గుడిసె యాదగిరి, రైతుబంధు సేవా సమితి జిల్లా డైరెక్టర్ చిట్టెడి భగవంత రెడ్డి, రైతు బంధు సేవా సమితి చైర్మన్ బండ్ల రామచంద్రం, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దా యారి సాయి రెడ్డి, ఎంపీపీ మాజీ అధ్యక్షుడు బైండ్ల సుదర్శన్, మాజీ సర్పంచ్ తాటిపాముల నాగభూషణం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed