ప్రిన్సిపాల్ తోనే నాకు టార్చర్

by Sridhar Babu |
ప్రిన్సిపాల్ తోనే నాకు టార్చర్
X

దిశ, భిక్కనూరు : పిల్లలకు కూరలు సరిగా పెట్టడం లేదని ప్రశ్నించినందుకు తనపై కక్ష కట్టి వివిధ రకాలుగా టార్చర్ పెడుతుందని, తద్వారా తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, నాకు ఏం జరిగినా ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలని కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాం పల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పీఈ టీ వీణ తన సెల్ ఫోన్ లో శుక్రవారం స్టేటస్ పెట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... గత కొద్ది రోజులుగా పాఠశాల ప్రిన్సిపాల్ మమతను పీఈటీ వీణ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ప్రశ్నించింది.

దీంతో అప్పటి నుంచి అది మనసులో పెట్టుకున్న ప్రిన్సిపాల్ ఏదో రకంగా ఆమెను టార్చర్ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయమై వీణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమెకు బీపీ పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. మూడు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయిన ఆమె శుక్రవారం ఇంటికి చేరుకుంది. తాను భోజనం సరిగా పెట్టడం లేదని ప్రశ్నించినందుకు గాను, అది మనసులో పెట్టుకున్న ప్రిన్సిపాల్ తాను డ్యూటీలో ఉన్న సమయంలో పిల్లలను కూడా మాట్లాడనీయకుండా చేసిందని, తద్వారా తాను మానసికంగా కృంగిపోయానన్నారు. అది తాను మైండ్ కు తీసుకోవడం వలన, తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరడం జరిగిందని, తనకు ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రిన్సిపాలే బాధ్యత వహించాలని తన సెల్ ఫోన్ లో స్టేటస్ మెసేజ్ పెట్టుకోవడం జిల్లాలో హల్ చల్ అయింది.

టార్చర్ పెట్టలేదు...

ఉద్యోగరీత్యా డ్యూటీ సరిగా చేయాలని మాత్రమే చెప్పాను తప్ప ఆమెను టార్చర్ చేయాల్సిన అవసరం తనకు ఎంత మాత్రం లేదని పాఠశాల ప్రిన్సిపాల్ మమత వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed