- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం సేల్ కు దసరా కిక్కు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలకు దసరా కొత్త కిక్కునిచ్చింది. గతంలో కంటే ఎక్కువగా దసరా పండుగకు నాలుగు రోజుల ముందు ఉమ్మడి జిల్లాలో రూ.15 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 122 మద్యం దుకాణాలు, 16 బార్లలో రూ.15 కోట్ల 51 లక్షల 7 వేల మద్యం అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అందులో లిక్కర్ 12,494 కేసులు కాగా, బీర్లు 34,400 కేసులు కావడం గమనార్హం.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 121 కోట్ల 95 లక్షల 93 వేల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఐఎంఎల్ డిపో అధికారులు తెలిపారు. అందులో లక్షా 19 వేల 500 కేసుల లిక్కర్, లక్షా 84 వేల 600 కేసుల బీర్లు ఉన్నాయి. దసరా అమ్మకాలు ఉమ్మడి జిల్లాలో మద్యం వ్యాపారులకు మంచి కిక్కును ఇచ్చాయి. మందుబాబులు మాత్రం సుక్క, ముక్క లేకుండా పండుగ జరుపుకున్నారన్నది అమ్మకాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగు రోజుల మద్యం అమ్మకాలే రూ.15 కోట్లు కాగా మిగిలిన 26 రోజుల కాలంలో మద్యం అమ్మకాలతో ఆబ్కారిశాఖకు దండిగా ఆదాయం లభించినట్లయింది.