ముగ్ధ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో సందడి చేసిన హీరోయిన్ నభ నటేష్..

by Hamsa |
ముగ్ధ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో సందడి చేసిన హీరోయిన్ నభ నటేష్..
X

దిశ నిజామాబాద్ సిటీ: నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్‌లో గల ముగ్ధ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, సినీ నటి ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభ నతేష్ విచ్చేసి వస్త్ర దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ముగ్ధ షాపింగ్ మాల్ యజమానులు శశి వంగపల్లి, సందీప్, మైత్రేయి, హీరోయిన్ పూజలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో మొట్ట మొదటి హోల్ సేల్, రిటైల్ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం అభినందనీయం అని ఎమ్మెల్యే అన్నారు. హీరోయిన్ నభ నతేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అభిమానులు సెల్ఫీలు, కేరింతలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ముగ్ధ షాపింగ్ మాల్ యజమానులు శశి వంగపల్లి, సందీప్, మైత్రేయి, నగర మేయర్ నీతూ కిరణ్, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story