ఎస్సారెస్పీలోకి భారీగా వరద నీరు

by Nagam Mallesh |
ఎస్సారెస్పీలోకి భారీగా వరద నీరు
X

దిశ, బాల్కొండ: మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో మిగులు జలాలు గేట్లను ఎత్తి 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈఈ కె.రవి తెలిపారు. అంతేకాకుండా ఎస్సారెస్పీకి గోదావరి పరివాహక ప్రాంతాలలో కురిసిన వర్షాలతో 3 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు. ఉదయం నుండి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ఆదివారం ఉదయం వరకు మరింత వరద పెరిగే అవకాశం ఉందని ఏఈఈ తెలిపారు. ఈ సీజన్లో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీ రిజర్వాయర్ లోకి 52.599 టీఎంసీల వరద వచ్చి చేరింది. కాకతీయ కాలువలకు 3 వేలు, సరస్వతి కాలువలకు 100 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091. 00 అడుగులు 80.5 టీఎంసీల నీటి సామర్థ్యం కాగా శనివారం నాటికి 1082.20 అడుగులు 51.341 టీఎంసీల నీటి నిల్వ వుంది.

Advertisement

Next Story

Most Viewed