కోనోకార్పస్‌ మొక్కలతో ఆరోగ్యానికి ముప్పు...

by Sumithra |
కోనోకార్పస్‌ మొక్కలతో ఆరోగ్యానికి ముప్పు...
X

దిశ, ఆలూర్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం ఏటా నిర్వహించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించి.. అడవుల శాతాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని 2021 సంవత్సరంలో మొదలు పెట్టింది. ప్రజల్ని కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా, ఊరూరా పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. అయితే పూలు, పండ్లతో పాటు కలపనిచ్చే చెట్లను రహదారులకు ఇరువైపులా నాటేలా చేసింది. కానీ ఈ చెట్ల వల్ల పర్యావరణానికి, మానవాళికి లాభాలే తప్ప ఎలాంటి నష్టాలూ ఉండవు.

ఓ మొక్క అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది..

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 532 గ్రామపంచాయతీలో ఎన్ఆర్ఈజీఏ పథకం ద్వారా, గ్రామపంచాయతీ ఫండ్స్ ద్వారా , నర్సరీలు ఏర్పాటు చేసి, లక్షలు వెచ్చించి, కోనోకార్పస్‌ మొక్కలను గ్రామానికి 2000 - 2500 మొక్కలను నాటారు. అదే ఇప్పుడు ప్రజలకు శాపంగా మారింది.

ఎక్కడ చూసినా ఈ చెట్లు పెంచుతున్నారు.. ఇవి ఎంత డేంజర్ అంటే..

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. అనేది నానుడి. అయితే ఇది అన్ని రకాల చెట్లుకు వర్తించదని కొనోకార్పస్‌ వృక్షాలు రుజువు చేస్తున్నాయి. ఈ చెట్లు మానవ మనుగడకు, పర్యావరణానికి హాని కలిగిస్తాయంటే ఆశ్చర్యం కాదు. పచ్చని చెట్లతో వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం జీవం మనుగడ ఆరోగ్యంగా వృద్ధి చెందుతుంది. అందుకే మొక్కల పెంపకాన్ని.. చెట్ల సంరక్షణను ప్రభుత్వాలతో పాటు పర్యావరణవేత్తలు, ప్రజలు ఓ ఉద్యమంలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వరకు విస్తృతంగా పెంచిన కొనోకార్పస్‌ చెట్ల వల్ల పర్యావరణం, జీవవైవిధ్యానికి, మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణవేత్తలు, వృక్షశాస్త్రవేత్తలు తేల్చారు.

నగరాలకు, పట్టణాలకు ప్రస్తుతం పల్లెల్లో కూడా విస్తారంగా పెంచుతున్న కొనోకార్పస్‌ చెట్లతో ముప్పు వాటిల్లితుందని పర్యావరణవేత్తలు తేల్చిచెప్పారు. పచ్చగా.. ఏపుగా.. అందంగా.. తొందరగా పెరిగే లక్షణాలు ఉండటంతో ప్రభుత్వం రోడ్ల వెంబడి, డివైడర్ల మధ్యలో ఈ చెట్లను విస్తృతంగా పెంచింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పెంచుతున్నారు. త్వరగా పెరిగే స్వభావం ఉండటంతో నగరాలు, పట్టణాల్లో ఈ మొక్కలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పచ్చదనం సుందరీకరణలో భాగంగా మున్సిపాల్టీల్లో ఈ మొక్కలను విస్తృతంగా పెంచుతున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన కొనోకార్పస్‌ చెట్ల పెంపకం గత కొంతకాలంగా పల్లెలకు కూడా విస్తరించింది.

ఈ చెట్టు పట్టణం పల్లె అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం పాతుకుపోయింది. పార్కులు, గృహాల్లో, విద్యాసంస్థల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ వీటిని పెంచుతున్నారు. ఈ చెట్ల నుంచి వెలువడే పుప్పొడి వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు భూమిలోని కేబుళ్లు, తాగునీరు, డ్రెయినేజీ పైపులు ధ్వంసమవుతున్నాయని తేలింది. ఈ చెట్ల పై పరిశోధనలు జరిపిన పాకిస్తాన్‌, ఇరాన్‌, కతర్‌, యూఏఈ తదితర దేశాలు వీటిని పూర్తిగా నిషేధించాయి. ఈ మొక్కతో కీటకాలకు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదని తేలింది. వీటి పై పక్షులు గూళ్లు కట్టవని, ఏ జంతువూ దీని ఆకులను తినవని పరిశోధనల్లో గుర్తించారు. పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోతే అనేక దుష్ప్రభావాలు మాత్రం కలుగజేస్తుందని వృక్ష శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొనోకార్పస్‌ చెట్లను తొలగించడం తక్షణవసరంగా ఉంది.

వామ్మో నాలుగేళ్లకే గుండెపోటు.. లక్షణాలు ఇవే..!

ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ జనవరి నెలల్లో గుత్తులుగా పూలు పూస్తాయి. వీటి నుంచి మంచి వాసన వ్యాపిస్తుంది. మంచు, చలితో పాటు తేమ వాతావరణంలో ఆ సువాసన దట్టంగా పరిసరాల్లో పరుచుకుంటుంది. అదే సమయంలో పూల నుంచి జాలువారి పుష్పొడి శ్వాసకోశాల్లోకి చొరబడి పలు రుగ్మతలకు కారణమవుతుందని వైద్య అధ్యయనాల్లో తేలింది. మనుషుల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావంతో పాటు పర్యావరణానికి హాని తల పెడుతుందని వృక్ష శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కోనోకార్పస్ ఎక్కడి నుంచి వచ్చింది ?

కోనోకార్పస్ అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరిగుతుంది.

అరబ్, మధ్య ప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లకు, వేగంగా వీచే వేడి గాలులకు అడ్డుగోడగా పనిచేస్తుందని మొదట్లో ఈ మొక్కలను విస్తృతంగా నాటారు.

"ఏపుగా ఒక కోన్ షేప్‌లో పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను సందర్శించిన నర్సరీల నిర్వాహకులు, మన ప్లాంటేషన్ ఎక్స్‌పర్ట్ దీన్ని భారతదేశానికి తీసుకువచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీలు ,అర్బన్ ఏరియాల్లో నాటారు. మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు కాబట్టి ఇది పర్యావరణ సంబంధిత దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అంతే కాకుండా, శ్వాస సంబంధిత వ్యాధులు, అనేక రకాల ఎలర్జీలకు కోనోకార్పస్ కారణం అవుతుంది.

తెలంగాణతో పాటూ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కోనోకార్పస్‌పై విస్తృత చర్చ సాగింది. మహారాష్ట్రలో ‘పుణె’ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పబ్లిక్ పార్కులలో కోనోకార్పస్ మొక్కల పెంపకాన్ని చేపట్టొద్దని స్థానిక పర్యావరణవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు.

హడలిపోతోన్న వృక్ష శాస్త్రవేత్తలు..

కొనోకార్పస్‌ మొక్క నిటారుగా ఏపుగా పెరిగి అన్ని కాలాల్లో పచ్చదనం కళకళ లాడుతుంది. అయితే ఈ చెట్టు తన దుష్ప్రభావాలతో ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నదని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ఈ చెట్ల పెంపకం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గుర్తించారు. ఈ చెట్ల కాయల నుంచి వెలువడే పుప్పొడి ద్వారా ఆస్తమా, అలర్జీ, శ్వాసకోస వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నట్లు వృక్ష శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దీంతో కొనోకార్పస్‌ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్ష శాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. కొనో కార్పస్‌ను డేంజర్‌ ట్రీగా గుర్తించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం దీనిని నిషేధించింది. కానీ నిర్మూలించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు.

కోనోకార్పస్‌ మొక్కలను తొలగించాలి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కోనోకార్పస్‌ మొక్కలు మంచిది కాదంటూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంతో మొక్కలను తొలగించే పనిలో పడ్డారు అధికారులు.

Next Story