ప్రతి నిరుపేదకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా

by Sridhar Babu |
ప్రతి నిరుపేదకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి నిరుపేద బిడ్డకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, సామాన్యులందరికీ విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే తన ప్రథమ కర్తవ్యం అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండల కేంద్రంలో బుధవారం ఆర్టీసీ డిపో, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ పాఠశాలలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నందిపేట్ మండల కేంద్రంలో గల పలు సమస్యలను పరిశీలించి వెంటనే అధికారులు పరిష్కరించా లన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులను సమస్యల గురించి పూర్తిగా తెలుసుకొని సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నందిపేట్ లో ఆర్టీసీ డిపో కోసం ప్రజలు ఇచ్చిన కోట్ల రూపాయల విలువైన స్థలంలో డిపో ఏర్పాటు కాకపోగా,

పూర్తిగా దుర్వినియోగంగా మారిందని, దీనిని క్రీడా ప్రాంగణానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దు కుందామన్నారు. ఈ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేయాలని కానీ, దుర్వినియోగం చేయాలని కానీ చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతానని చెప్పారు. దశల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాంబారు వాణి తిరుపతి, ఎంపీటీసీ పెయింటర్ రాజు, వార్డు సభ్యులు మాన్ పూర్ భూమేష్, బీజేపీ మండల అధ్యక్షులు భూతం సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story