చోరీకి గురైన గ్రామపంచాయతీ వాటర్ ట్యాంక్.. ఆందోళన చేస్తున్న గ్రామస్తులు..

by Sumithra |
చోరీకి గురైన గ్రామపంచాయతీ వాటర్ ట్యాంక్.. ఆందోళన చేస్తున్న గ్రామస్తులు..
X

దిశ, తాడ్వాయి : దొంగలు మరింత అప్డేట్ అయ్యారా.. లేదా ఆ గ్రామ పంచాయతీని టార్గెట్ చేశారా. అదేంటి అలా అంటున్నారని అనుకుంటున్నారా.. అవును సాధారణంగా దొంగలు నివాసముంటున్న ఇళ్ల పై, వ్యవసాయ క్షేత్రాల పై దొంగతనాలకు పాల్పడడం చూసి ఉంటారు. కానీ కొంతమంది గ్రామ పంచాయతీలనే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లగా మండలంలోని గ్రామ పంచాయతీలె టార్గెట్ గా కృష్ణజివాడి గ్రామపంచాయతికి చెందిన బోర్ మోటార్లు, పైపులు, వాటర్ ట్యాంక్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన వాటిని పెద్దగా గ్రామస్తులు పట్టించుకోరెమో అని అనుకున్నారెమో... అదే అదునుగా ఎవ్వరూ లేని సమయంలో కృష్ణాజివాడి గ్రామ పంచాయతీ నర్సరీ దగ్గర పెట్టిన వాటర్ ట్యాంకును గత ఆదివారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు.

దీంతో ఆ గ్రామ పంచాయతీ సెక్రెటరీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా వాటర్ ట్యాంక్, దొంగల ఆచూకీ లభించకపోవడంతో కృష్ణజివాడి గ్రామస్తులందరూ కలిసి కామారెడ్డి - ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వాటర్ ట్యాంక్ దొంగతనం జరిగిందని ఆందోళన చేశారు. గ్రామ పంచాయతీకి చెందిన పరికరాలకే రక్షణ లేనప్పుడు గ్రామంలో ఉండే ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుందని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు, ఆయన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగను పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. దొంగను పట్టుకునే పనిలోనే ఉన్నామని చోరికి గురైన దాని పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు అతి త్వరలోనే దొంగను పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన వివరించారు.

Next Story

Most Viewed