డాక్టర్ ను అభినందించిన గవర్నర్..

by Sumithra |   ( Updated:2023-03-21 09:32:17.0  )
డాక్టర్ ను అభినందించిన గవర్నర్..
X

దిశ, కామారెడ్డి రూరల్ : హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో యువ ఉగాది కార్యక్రమంలో భాగంగా ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ అభినందించారు. డాక్టర్ బాలు వ్యక్తిగతంగా 69 సార్లు, 2007 నుండి కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి 15,000 యూనిట్లకు పైగా రక్తాన్ని, కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 800 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు ఆయనను అభినందించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సూచించారు. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించడానికి యువకులు ముందుకు రావాలని కోరారు. దేశ అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ బాలు మాట్లాడుతూ ఈ అవకాశము రావడానికి ఎంతగానో సహకరించిన రక్తదాతలకు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed