- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి..
దిశ, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జోగినపల్లి రంగారావు, జాతీయ కార్యదర్శి కొండెల సాయి రెడ్డిలు డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మి దేవి గార్డెన్ లో నిర్వహించారు. అక్టోబర్ 5 న జిల్లా కేంద్రంలో తలపెట్టిన రాష్ట్ర రైతు మహాసభ విజయవంతానికి గాను సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సమస్యల పై పోరాడేందుకు భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గ కమిటీని ప్రతి మూడేళ్లకోసారి ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.
అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారని తెలిపారు. అక్టోబర్ 5న రాష్ట్ర స్థాయి రైతు మహాసభ నిర్వహించబోతున్నామని అందుకు సంబంధించిన విషయాలపై గ్రామ, మండల రైతు కమిటీలతో సన్నాహక సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఈ సభ ద్వారా డిక్లరేషన్ చేయబోతున్నామని తెలిపారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా సభ్యత్వాలు ఉన్న జిల్లా కామారెడ్డి జిల్లా అని అన్నారు. రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.