సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలికిన సర్కారు బడులు

by Mahesh |
సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలికిన సర్కారు బడులు
X

దిశ, నిజామాబాద్ సిటీ: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామన్న మాటలు స్థానికంగా జిల్లాలో విద్యాశాఖ అధికారుల అలసత్వంతో నీటి మూటలుగా పరిస్థితి నెలకొంది. జిల్లాలో చాలావరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ పాఠశాల స్థితిని మారుస్తామని చెప్పి పేర్లు మార్చి నిధులు వెఛిస్తున్నారే తప్ప విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. గత ప్రభుత్వం మన ఊరు మనబడి పేరిట ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మార్చాలని నిధులు వెచ్చించి కోట్ల రూపాయలు వృధా చేశారు తప్ప, ఆ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు.

ఈ విద్యా సంవత్సరం కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాటి అభివృద్ధి కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలలకు 739 బడులను ఎంపిక చేశారు. కానీ ఏ ఒక్క పాఠశాలలో కూడా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు విద్యాసంవత్సరం రోజే స్పష్టంగా కనిపించింది. సుమారు నెలన్నర రోజుల పాటు కొనసాగిన వేసే విషయంలోను ముగించుకొని విద్యార్థులు తమ బడులకు వస్తే ఆ ప్రభుత్వ పాఠశాలలో సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలికాయి. కొన్ని బడుల్లో గతే దాని ఎదుర్కొన్న సమస్యలే మళ్లీ విద్యార్థులు చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా బరులు పునః ప్రారంభం అయ్యే లోగా పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా అసంపూర్తిగానే మిగిలాయి.

మరుగుదొడ్లు, కిటికీలు, తలుపులు లేని తరగతి గదిలో తాము ఎలా విద్యను అభ్యసించాలని జిల్లా విద్యాధికారులకు మౌనంగా ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 789 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 137, ఉన్నత పాఠశాలలు 269 ఉన్నాయి. అయితే మొత్తంగా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం లక్ష 12 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ఈ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది ఇలా ఉండగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సంబంధించి పాఠశాలలో మౌలిక వసతులు అభివృద్ధి పనులకై ప్రభుత్వం జిల్లాకు 39. 38 కోట్లు మంజూరు చేసింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థుల చదువులు సవాల్ గా మారాయి. ఇక జిల్లా కేంద్రంలో గత యేడాది నగరంలోని కోట గల్లి లో ఉన్న గర్ల్స్ హైస్కూల్లో విద్యుత్ సరఫరా లేక వర్షాకాలంలో తెగిపోయిన వైర్ల వల్ల స్కూల్ భవనానికి కరెంట్ షాక్ ఏర్పడి విద్యార్థులు విద్యుత్ ఘాతానికి గురైన సందర్భాలు ఉన్నాయి.

అయినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులో వారి నిర్లక్ష్యం మూలంగా ముందస్తు జాగ్రత్తలు కనీసం తీసుకోకుండా తూతూ మంత్రంగా ప్రభుత్వ పాఠశాలలను అరకొర వసతులతో ప్రారంభింపచేశారు. ప్రచార అర్బటాలతో మామా అనిపించి చేతులు దులుపుకున్నారు. ఈ పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే నిజామాబాద్ నగర శివారులోని గూపనపల్లిలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గత సంవత్సరం వర్షాకాలంలో వర్షపు నీటికి పూర్తిగా పాఠశాల మునిగిపోయింది. అయినా కానీ ఇప్పటికీ కూడా ఆ పాఠశాల కు విద్యాశాఖ అధికారులు మరమ్మతులు మాత్రం చూపించకపోవడం శోచనీయం. అయితే గత కొన్ని రోజుల నుంచి జిల్లా కలెక్టర్ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని క్షేత్రస్థాయిలో పర్యటించి నప్పటికీ విద్యాశాఖ అధికారులు మాత్రం కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ విద్యార్థులకు సమస్యల సుడిగుండంలో నెట్టివేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల కనీస మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed