Rajinikanth: అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్‌స్టార్

by Shiva |
Rajinikanth: అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్‌స్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యంతో సెప్టెంబర్ 30న అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీ‌కాంత్ (Super Star Rajinikanth) ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంపై వాపు రావడంతో వైద్యులు ఆయనకు నాన్‌ సర్జికల్‌ ట్రాన్స్‌కాథెటర్‌ (A non-surgical transcatheter) పద్ధతిలో గుండెలో స్టెంట్ వేశారు. ఈ మేరకు చికిత్స అనంతరం వైద్యులు రజినీని మూడు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటడంతో శుక్రవారం ఉదయం రజినీకాంత్ (Rajinikanth) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, మరో వారం రోజుల పాటు వైద్యులు ఆయనను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

కాగా, రజినీకాంత్ (Rajinikanth) ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) రజినీ భార్య లతకు స్వయంగా ఫోన్ చేసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్‌ (CM Stalin), హీరో కమల్‌హాసన్‌ (Kamal Hasan), తపపతి విజయ్‌ (Thalapathy Vijay) రజనీ త్వరగా కోలుకుని ఇంటికి తిరిగిరావాలని ‘X’ (ట్విట్టర్ వేదికగా) కోరుకున్నారు.

Advertisement

Next Story