గాంధారి చిరకాల వాంఛ నెరవేరింది..

by Sumithra |
గాంధారి చిరకాల వాంఛ నెరవేరింది..
X

దిశ, గాంధారి : గాంధారి మండల కేంద్రంలో గుండమ్మ కాలువ అభివృద్ధి నిమిత్తమై జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి గాంధారి ప్రజలు, యువకులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి అర్థనగ్నప్రదర్శన, రోడ్డుపై వంటావార్పు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అప్పుడే గుండమ్మ కాలువ అభివృద్ధి డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు నిర్మాణం కోసం జువ్వడి రాకేష్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. అప్పుడు ఎమ్మెల్యేగా ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్న తరుణంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో పలువురి పై చాలాకేసులు నమోదయ్యాయి.

అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి గాంధారికి వచ్చి ఏదేమైనా సరే తప్పనిసరిగా గుండమ్మ కాలువ డ్రైనేజీ, రోడ్డు పనులు జరిపిస్తానని హామీ ఇచ్చి నిమ్మరసం తాగించి జారుకున్నాడు. గాంధారి మండల కేంద్రంలో గల గుండమ్మ కాలవ రోడ్డు (బైపాస్ రోడ్డు) ఎన్నో రోజులుగా అభివృద్ధికి నోచుకోలేని గుండమ్మ కాలువ రోడ్డు ఇప్పటి ఎమ్మెల్యేగా ఉన్న జాజార సురేందర్ ఎలక్షన్ హామీలలో భాగంగా అటు డ్రైనేజీ, రోడ్లు పూర్తి చేయించడంతో మరోసారి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఇచ్చిన మాట నిలుపుకున్నాడు.

ఈ పేరే కాకుండా యావత్ గాంధారి ప్రజలకు ఊరు చుట్టూ తిరిగే భారం కాకుండా గాంధారి మండల కేంద్రంలో ఊర్లోకి వెళ్లడానికి ఇదే షార్ట్ కట్ గా ఉండడంతో ఈ రోడ్డు బాగుపడడంతో గాంధారివాసుల చిరకాల వాంఛ నెరవేరింది. దీంతో ప్రజలందరూ ప్రత్యేకంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గాంధారి మండల కేంద్రానికి సర్పంచ్ గా ఉన్న మమ్మాయి సంజీవ్ యాదవ్ కూడా ఎమ్మెల్యే జాజాల సురేందర్ దృష్టికి పదేపదే తీసుకుపోయి బిల్లు పాస్ చేయించుకుని చాలా కష్టపడ్డారని దానికి ప్రతిఫలమే గుండమ్మ కాలువ రోడ్డు పూర్తి కావడం అన్నారు. అందులో సర్పంచ్ పాత్ర కీలకమని గ్రామస్తులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed