పేద ప్రజలకు సహాయం చేయాలి.. మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌..

by Sumithra |
పేద ప్రజలకు సహాయం చేయాలి.. మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌..
X

దిశ, నిజామాబాద్ సిటీ : పేద ప్రజలకు సహాయం చేయాలి. వారికి తక్కవ ఖర్చులతోనే వైద్యం అందించాలని మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ అన్నారు. మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ నగరంలోని ద్వారకనగర్ లో గల గంగాసరస్వతి పిల్లల హాస్పిటల్ డాక్టర్ శ్రీశైలంతో పాటు పలువురు నిజామాబాద్ డాక్టర్లతో మాట్లాడారు. డాక్టర్లు దీపక్ రాథోడ్, అజ్జ శ్రీనివాస్, డాక్టర్ వినయ్ ధన్ పాల్, సత్యకుమార్ స్వామి, డాక్టర్ ఆనంద్, అరవింద్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వెంకట్, రాజేష్ లతో వైద్య విధానం, వైద్యంలో మార్పులు గురించి మాట్లాడారు. పిల్లలకు ఎక్కువగా జబ్బులు ఏమి వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ అనేక పథకాలు అమలు చేశారని ఆయుష్మన్ భారత్ అమలు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కాగా పిల్లల్లో వైరల్ ఫీవర్, డెంగ్యూ ఎక్కువగా వస్తుందని డాక్టర్లు తెలిపారు. పేద ప్రజలకు సహాయం చేయాలని, వారికి తక్కవకే వైద్యం అందించాలని అన్నారు.

ఈ సందర్భంగా ఇక్కడే మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రధానమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున, మహాజన్ సంపర్క అభియాన్ లో భాగంలో డాక్టర్లతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానన్నారు. ఉదయం రైల్వేస్టేషన్ లో గూడ్స్ హమాలిలతో మాట్లాడానని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నానని తెలిపారు. ఎవరైనా పేదవాళ్లు అనారోగ్యం బారిన పడితే వాళ్ళ డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు వారికి చికిత్స గురించి అందిస్తున్నామన్నారు. దేశంలో డాక్టర్ల కొరత ఉందని, 1,50,000 మెడికల్ సీట్లు ఉన్నాయని అన్నారు. మెడికల్ కాలేజీలు పెంచామని తెలిపారు. ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీలు 300 నుంచి 600 వరకు పెంచామని కరోనా సమయంలో డాక్టర్లు, సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వర్కర్స్ కు సన్మానం చేశామని గుర్తు చేశారు.

జన్ ఔషధీ కేంద్రాలు 10వేలు ఏర్పాటు చేశామని తెలిపారు. తక్కువ ధరకు ప్రజలకు మందులు దొరుకుతున్నాయన్నారు. ఒక రూపాయికి సానిటేషన్ నాప్కిన్ దొరుకుతుందన్నారు. ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరం ఇటువంటి కార్యక్రమాలు చేయడం బీజేపీ ఉద్దేశమని, ఇటువంటి విషయాలు డాక్టర్లతో మాట్లాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బస్వ లక్మి నర్సయ్య, సీనియర్ నాయకులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మి నారాయణ, పోతాంకర్ లక్ష్మీ నారాయణ న్యాలం రాజు పార్టీ జిల్లా కార్యదర్శి, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed