కులవృత్తులకు బీఆర్ఎస్ పాలనలో పూర్వ వైభవం

by Sridhar Babu |   ( Updated:2023-10-10 10:20:28.0  )
కులవృత్తులకు బీఆర్ఎస్ పాలనలో పూర్వ వైభవం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకువస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం కంఠేశ్వర్ లో గౌడ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీసీ ల ప్రభుత్వమని, కన్న తల్లి వంటి కుల వృత్తుల కు బీఅర్ ఎస్ పాలనలో పూర్వ వైభవం తీసుకువచ్చిందన్నారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశాయని, కానీ కేసీఆర్ ఆనాడే ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటు అయితే గౌడ కులస్తులకు అండగా ఉంటానని, అలాంటి కులవృత్తులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. గీత కార్మికుల కు ఏమైనా సమస్యలు ఉంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.

మద్యం టెండర్ల లో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ ఇస్తున్నామని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల కాలం లో నిజామాబాద్ నుండి ఎంతో మంది పెద్దనాయకులు పనిచేశారని, జిల్లాకు ఒకటే బీసీ హాస్టల్ ఉంటే అలాంటిది ఈరోజు 15 బీసీ హాస్టల్ లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కుల వృత్తుల వారికి కేసీఆర్ అండగా నిలిచారన్నారు. కల్లు గీత కార్మికులకు

ఆసరా పింఛన్లు అందిస్తూ వృత్తిని నమ్ముకున్న వారికి భరోసాని ఇచ్చామన్నారు. కల్లు గీత కార్మికుడు మరణిస్తే బీమా ని అందిస్తూ వారి కుటుంబ సభ్యుల్లో ధీమా కల్పిస్తున్నామని, గౌడ కులస్తుల ఆత్మ గౌరవానికి ప్రతీక గా గౌడ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసామన్నారు. గౌడ సంక్షేమానికి కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని, నిజామాబాద్ అభివృద్ది లో భాగంగా ఆర్ యూబీ నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేసామన్నారు. ఈ కార్యక్రమం లో నగర మేయర్ దండు నీతు కిరణ్ , టీఎస్ డబ్ల్యూడీసీ చైర్ పర్సన్ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ వి. జి. గౌడ్ , గౌడ సంఘం నాయకులు సత్య నారాయణ గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్, అంబటి శ్రీను, రమణ గౌడ్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed