శబరిమాత ఆశ్రమలో సంచలనంగా మారిన సంతకాల ఫోర్జరీ

by Mahesh |
శబరిమాత ఆశ్రమలో సంచలనంగా మారిన సంతకాల ఫోర్జరీ
X

దిశ, తాడ్వాయి: నమ్మిన భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారికి శఠగోపం పెట్టారు. నిత్యం అమ్మవారి అలనా పాలనా చూసుకునే ఆశ్రమ కమిటీలోని సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి అమ్మవారికి చెందిన లక్ష రూపాయలను కాజేసినట్టు తెలుస్తోంది. తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరి మాత ఆశ్రమం లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా గ్రామంలోని వాట్సాప్ గ్రూప్‌లలో మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీ శబరి మాత ఆశ్రమ కమిటీలోని సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.లక్ష కాజేసినట్టు మండల కేంద్రంలో వాట్సాప్ గ్రూపులలో వైరల్ గా మారింది. దీంతో ఆ వాట్సాప్ మెసేజ్ చూసిన గ్రామస్తులు ఒక్క సరిగా కంగుతిన్నారు.

అమ్మ వారి భక్తులు చందాలు, దానధర్మాలు చేసి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న శబరి మాత ఆశ్రమ పాలకవర్గంలోని ఒక ముఖ్య సభ్యుడు బ్యాంకు చెక్కుపై అధ్యక్షుని, కోశాధికారి సంతకాలు ఫోర్జరీ చేసి రూ.లక్ష కాజేసినట్టు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇలాంటి వ్యక్తుల వలన ఈ ఆశ్రమం ఏం కావాలి, ఇలాగే చూస్తూ ఉండిపోతే ఏదో ఒక రోజు ఆశ్రమాన్ని వేలం వేస్తారు. అంటూ వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొడుతుండడంతో గ్రామ ప్రజలు, అమ్మ భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిన విషయంపై దొంగ ఎవరు, దొర ఎవరు అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed