మొబైల్ షాప్ లో అగ్నిప్రమాదం

by Sridhar Babu |
మొబైల్ షాప్ లో అగ్నిప్రమాదం
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైటెక్ మొబైల్ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్ర వారం తెల్లవారుజామున నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద గల హైటెక్ మొబైల్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. గురువారం ఎప్పటిలాగే రాత్రి షాపు మూసివేసి వెళ్లానని శుక్రవారం ఉదయం దుకాణం పక్కన ఉన్న స్థానికులు మొబై ల్ షాప్ నుండి పొగ వస్తుందని సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన దుకాణానికి వచ్చానని బాధితుడు తెలిపారు. ఈ ప్రమాదంలో మొబైల్స్, కంప్యూటర్స్, సీసీ కెమెరాలు కాలిపోయాయని, లక్షల రూపాయలు నష్టపోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed