- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మృతి చెందిన విద్యుత్ లైన్మెన్ కుటుంబానికి ఆర్థిక సాయం
దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్ మూర్లో మార్చి నెలలో విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదానికి గురై 43 రోజుల పాటు హైదరాబాదులోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఏప్రిల్ నెల 16న మంగళ్ చంద్ రాథోడ్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు వెంకటేశ్వర ఏసీ ఫంక్షన్ హాల్ లో విధి నిర్వహణ సమయంలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన నేపథ్యంలో పెర్కిట్ లో గల వెంకేశ్వర ఏసి ఫంక్షన్ హాల్ యాజమాన్య ప్రతినిధులు నరహరి- లలిత దంపతులు శనివారం మృతుని కుటుంబ సభ్యులకు రూ.100,000 ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ యాజమాన్య ప్రతినిధులు నరహరి- లలిత దంపతులకు, దిశ దినపత్రికకు విద్యుత్ ఉద్యోగులు, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనార్దన్ గౌడ్, కే.జీ బిల్డర్ కే.గంగాధర్, విద్యుత్ ఉద్యోగులు చంద్రమౌళి, నరేందర్ నాయక్, యాదగిరి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.