ముప్కాల్ లో సినిమా షూటింగ్ సందడి..

by Sumithra |   ( Updated:2024-09-16 11:43:48.0  )
ముప్కాల్ లో సినిమా షూటింగ్ సందడి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. యువతలో స్ఫూర్తిని నింపే కథాంశంతో, నూతన నటీనటులతో గ్రామీణ నేపథ్యంలో నిర్మించనున్న సినిమా గ్యాంగ్ ఆఫ్ గోపాల్ పేట్. ఈ చిత్రం షూటింగ్ ముప్కాల్ శివారులోని పడిలేచిన మర్రిచెట్టు దేవస్థానం వద్ద ఆదివారం రాత్రి ప్రారంభమైంది. ఈ చిత్రం రీల్ రియల్ మూవీ క్రియేషన్స్ వారి చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా నిర్మితమవుతుంది. కాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత శ్రీఫణీంద్ర నిర్మాణ సారథ్యంలో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఈ చిత్రానికి ప్రముఖ తెలంగాణ గేయ రచయిత కోదారి శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర దర్శకులు మధు మల్లం వైవి తెలిపారు. నూతన నటీనటులతో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మంచి కథతో, ఆకట్టుకునే సన్నివేషాలు ఇందులో ఉంటాయని అన్నారు. ఈ చిత్రానికి ముహూర్తం షాట్ ను టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ.రమేష్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ముప్కాల్, బాల్కొండ తదితర గ్రామీణ ప్రాంతాలలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరక్టర్ సంఘీర్, పాండురంగ బుక్స్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేతలు రాంరాజు, ఉమేష్, స్టూడియో శ్రీను, దశరథ్, ఆనంద్ గౌడ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed