- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెంజల్ మండల కేంద్రంలో రైతుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : 8 సంవత్సరాల క్రితం కోటి 54 లక్షలతో రెంజల్ దుపల్లి బీటి రోడ్డు నిర్మిస్తామని శంకుస్థాపన చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ లు ఇప్పటి వరకు రోడ్డుపని చేపట్టనందున రెంజల్ గ్రామానికి రావద్దని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. బుధవారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
రెంజల్ బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తామని 50 లక్షల నిధులు విడుదల చేసిన ఇప్పటికి పనులు ప్రారంభించకపోవడం పై రైతులు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. రెంజల్ రైతుల జీవన్మరణ సమస్యగా మారిన రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్లకార్డులు ధరించి నిరసనకు దిగారు. 8 ఏళ్లుగా రోడ్ల నిర్మాణం బీటీ రోడ్డు బైపాస్ రోడ్డు పనులు జరగకపోవడంతో రైతులకు ఇబ్బందిగా మారిందని వారు ఆందోళనకు పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా రైతులందరూ ఒక వేదిక పై నిరసన గలాన్ని వినిపిస్తున్నారు.