ఫైల్ ప్రాసెసింగ్ స్పీడ్.. గతేడాది కంటే పెరిగిందంటున్న హెచ్ఎండీఏ

by Aamani |
ఫైల్ ప్రాసెసింగ్ స్పీడ్.. గతేడాది కంటే పెరిగిందంటున్న హెచ్ఎండీఏ
X

దిశ, తెలంగాణ బ్యూరో : హెచ్ఎండీఏ డెవలప్‌మెంట్ ఫైల్ ప్రాసెసింగ్ పెరిగింది. గతం కంటే మెరుగ్గానే ఉందని అధికారులు చెబుతున్నారు. ఏ ఒక్క అధికారి దగ్గర 10 రోజుల కంటే ఎక్కువగా ఫైల్ పెండింగ్‌లో లేదని అధికారులు వెల్లడించారు. బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్ ఫైళ్లను పెండింగ్‌లో పెట్టకుండా వారంలో ప్రతి బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం తో పాటు అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. ఫైల్ ప్రాసెసింగ్ విధానంలో చాలా మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

గతేడాది కంటే..

జూన్ నుంచి అక్టోబర్ వరకు 2023, 2024 సంవత్సరాలను పరిశీలిస్తే 39 శాతం ఫైళ్లు పెరిగాయి. వాటిని క్లియర్ చేసే ప్రక్రియ 14.4 శాతం పెరిగింది. 2023లో 1,884 ఫైళ్లు వచ్చాయి. 2024లో వీటి కంటే 39 శాతం అధికంగా వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో 2023లో 2,038 ఫైళ్లను క్లియర్ చేస్తే ఈ ఏడాదిలో 2,332 ఫైళ్లను క్లియర్ చేశారు.

హెచ్ఎండీఏకు 64 మంది ఉద్యోగులు..

ఇటివల గ్రూప్-4 కింద ఎంపికైన 64 మంది ఉద్యోగులను ప్రభుత్వం హెచ్ఎండీఏకు కేటాయించింది. వీరిలో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు ఉన్నారు. వీరికి సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాత పోస్టింగ్ ఇవ్వనున్నారు.

Advertisement

Next Story

Most Viewed