- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఎవరూ చేయకూడని పని చేసిన రైతు.. అంతా షాక్
దిశ, భిక్కనూరు: చేసిన అప్పు తీరడం లేదు... కొత్తగా అప్పు పట్టడం లేదని తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మాగిని రాజయ్య అనే వ్యక్తి తనకున్న భూమిలో వ్యవసాయ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పంటల సాగుకు పెట్టుబడులు పెరిగిపోవడం, ఉన్న కొద్దిపాటి భూమిలో పంట సాగు చేస్తున్నా... అప్పు తీర్చలేక పోతున్నాననే మనోవేదనకు గురయ్యేవాడు. వ్యవసాయం చేస్తూనే మరోపక్క కామారెడ్డి పట్టణంలో దినసరి కూలీగా పని చేసుకునేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లాడు. కుటుంబ సభ్యులు రాజయ్య కోసం రాత్రంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. వేరే రైతు వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఆ విషయం గమనించిన కొందరు రైతులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద గుండెలవిసేలా రోధించారు. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు చరణ్, కుమార్తె అంకిత, తల్లి రామవ్వ ఉన్నారు. ఈ మేరకు భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.