స్వార్థ ప్రయోజనాల కోసం ఎత్తిపోతలు

by Sridhar Babu |
స్వార్థ ప్రయోజనాల కోసం ఎత్తిపోతలు
X

దిశ,నిజాంసాగర్ : జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు జరిగిన అన్యాయానికి ఉదాహరణ నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నాగమడుగు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లో విస్తూ పోయే నిజాలు ఎన్నో భయటపడ్డాయన్నారు. శుక్రవారం మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో మంజీరా నదిపై నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరిశీలించారు. నాగమడుగు ఎత్తిపోతలతో 300 ఎకరాల భూములు పోతున్నాయని, కరకట్ట ద్వారా పంట పొలాలు నీట మునుగుతాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో

మాట్లాడుతూ రైతుల బాగు కోసం కాకుండా కేసీఆర్ బాగు కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాన్ని తాకట్టుపెట్టి దరిద్రమైన మేడిగడ్డ ప్రాజెక్టు కట్టారన్నారు. కేసీఆర్ పెద్దరికం కోసం ప్రాజెక్టు కట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మినీ ఏటీఎం లా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. నాగమడుగు ఎత్తిపోతల పనులతో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి లిఫ్టును ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో నాన్ కమాండ్ ఏరియాకు సాగునీరు అందించాలన్నారు.

నాగమడుగు లిఫ్ట్ కు భూములు పోకుండా రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. నాగమడుగు లిఫ్ట్ విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి కోమటిరెడ్డి దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్టుతో జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న 4,500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జయ ప్రదీప్, రవీందర్ రెడ్డి, మల్లికార్జున్, ప్రజా పండరి, అనీస్ పటేల్, సంగమేశ్వర్ గౌడ్, మల్లయ్య గారి ఆకాష్, వెంకట్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమ్రొస్, రాము రాథోడ్, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed