ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?

by Sridhar Babu |
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?
X

దిశ, గాంధారి : ఆ రోడ్డులో ప్రయాణం చేయాలంటే సాహసమే. దుమ్ము విపరీతంగా లేవడంతో పాటు ఆదమరిస్తే వాహనం కిందకు దిగిపోయి ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి. అయినా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పొతంగల్ వద్ద చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులలో భాగంగా అభివృద్ధి జరుగుతుందని అందరూ ఆశించారు. అప్పటి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు త్వరత్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించినా కాంట్రాక్టర్కు బిల్లులు రాక పనిని పెండింగ్లో పెట్టాడు. మరమ్మతుల పనిలో భాగంగా కంకర వేసి వదిలేశాడు. దీంతో దుమ్ముల ఏసి అవతల వైపు నుండి ఎవరు వస్తున్నారో కనిపించడం లేదు.

దీంతో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురికావాల్సిందే. ఇటీవల కాలంలో గాంధారి మండలానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుతూ కిందపడి మృతి చెందాడు. బాన్సువాడకు చెందిన సెల్ఫోన్ యజమాని కారు కూడా అదుపుతప్పి మృతి చెందాడు. ఇద్దరు ప్రాణాలు విడిచినా రోడ్డు భవన శాఖ అధికారులు స్పందించలేదు. దీనిపై సంబంధిత ఏఈ శ్రీకాంత్ ను వివరణ కోరగా కాంట్రాక్టర్కు బిల్లులు రావడం లేదని, దాంతో నీళ్లు కూడా పట్టలేని పరిస్థితిలో ఉన్నామని వివరణ ఇచ్చాడు. కాంట్రాక్టర్ సక్రమంగా కంకర రోడ్డుపై ట్యాంకర్ తో నీళ్లు పడితే దుమ్ము దూళి లేవకుండా రోడ్డు ఇంకా గట్టిగా ఉంటుందని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని వెంటనే రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed