చిన్న వయసులోనే ఆ సమస్య.. వారానికి ముందే గుర్తించాల్సిన 4 లక్షణాలివే?

by Anjali |   ( Updated:2024-10-09 02:41:32.0  )
చిన్న వయసులోనే ఆ సమస్య.. వారానికి ముందే గుర్తించాల్సిన 4 లక్షణాలివే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ఇందుకు ఓ కారణం జీవన శైలిలో మార్పులే అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హార్ట్ ఎటాక్ అనే పేరు రేర్ గా ఎక్కడో ఒక చోట వినిపించేది. ఉదాహరణక 45ఏళ్లు మించిన వారికి లేదా వృద్ధులకు గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు యువత కూడా ఈ సమస్య బారిన పడుతుంది. క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని అనుకుంటున్నారు.. కానీ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కన్నా ఎక్కువగా హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువని రీసెంట్‌గానే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

కామన్‌గా గుండెపోటు రావడానికి ముందు ఎవరికైనా తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తుంది. 20-30 నిమిషాల కంటే ఎక్కువ సేపు వస్తుంది. ఈ నొప్పి చేతులు, గొంతు, దవడ లేదా వీపు కూడా వ్యాపిస్తుంది. అలాగూ చెమటలు పడుతాయి. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. వికారం, వాంతులు వంటి పలు లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇటీవల కాలంలో యువతలో గుండె పోటు వచ్చే వారానికి ముందే ఈ లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం..

కారణం లేకుండా అంటే.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నా మెడ, భుజం ఎక్కువగా పెయిన్ రావడం, ఛాతీలో నొప్పి, దవడ, మెడ, భుజాల్లో తీవ్రమైన నొప్పి, ఆకస్మాత్తుగా ఛాతీ బిగుతుగా అనిపించడం(ఇది ప్రారంభ సంకేతం)వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. కాగా గుండె ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ వ్యాయామం చేయండి. రాత్రి తప్పకుండా 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. నట్స్, ప్రోటీన్ పుడ్స్, నట్స్ ఆహారంలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed