- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలైన అర్హులకే పట్టాలు ఇస్తాం.. జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్
దిశ, రాజంపేట : మండల కేంద్రంలోని ఎల్లాపూర్ తండా గ్రామంలోని పోడు భూములను జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్ మండల అటవీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. పోడుభూముల విషయంలో సమస్యలను గురించి అక్కడి ప్రజలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూముల సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ తరువాతే అసలైన అర్హులకు పట్టాలు ఇస్తామని తెలిపారు.
డిసెంబర్ 2005 సంవత్సరం కన్నా ముందు కబ్జాలో ఉన్నవారి దరఖాస్తులను పరిశీలించి, అవసరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విస్తీర్ణం, సర్వే నంబర్ వంటి విషయాలను సరిగా గుర్తుంచి వివరాలను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుంగిన గ్రామ గుండారం గుండ్ల చెరువు కట్టను పరిశీలించారు. వెంట ఎఫ్ఆర్వో రమేష్, ఎఫ్డీవో గోపాలరావు, తహసీల్దార్, జానకి, ఎంపీడీఓ బాలకిషన్, ఆర్ఐ ఫుల్ సింగ్, గ్రామాల సర్పంచులు ఉన్నారు.