- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఆర్ ను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
దిశ ప్రతినిది, నిజామాబాద్ : సీపీఆర్ ను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియదని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గుండె జబ్బుల నివారణ కోసం అవగాహణ కార్యక్రమం మంగళవారం శ్రీరామా గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఆర్ అనేది చేయడం వేరు, దానిని ప్రత్యేకంగా నిర్వహించడం వేరు అని ప్రతిఒక్కరు సీపీఆర్ అనేది నేర్చుకోవాలని అన్నారు. ఈ మద్య కాలంలో కొన్ని జిల్లాలో గుండె జబ్బులకు గురైన వారికి ఈ సీపీఆర్ ద్వారా రక్షిస్తున్నామన్నారు.
ఈ మద్య కాలంలో పోలీస్ సిబ్బంది కూడా సీపీఆర్ ద్వారా ఒక వ్యక్తిని బతికించారని, సమాజంలో గుండె జబ్బు వచ్చి పడిపోయిన వారిని ఈ సీపీఆర్ ద్వారా బతికించడం ఎంతో గొప్ప విషయం అని కొనియాడారు. ఈ అవగాహణ కార్యక్రమాలు జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోగాని గ్రామాలలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని కొంత మంది వాలంటీర్ల సహయంతో ఈ సీపీఆర్ కోసం అవగాహణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినప్పుడు డీఎం అండ్ హెచ్.ఓ కి తెలియజేయాలని, జిల్లా స్థాయిలో మంచి రిసోర్సెస్ ఉన్నాయని, మాస్టర్ ట్రెయినర్స్ ఉన్నారని వారితో అవగాహణ కార్యక్రమాలు నిర్వహించవచ్చునని అన్నారు.
అనంతరం సీనియర్ కార్డియాలజిస్, కేర్ హాస్పటల్ గచ్చిబౌలీ, హైదరాబాద్ డాక్టర్ కె. చాణక్య కిశోర్ గుండె జబ్బుల నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, మెళకువలు, సూచనలు, సలహా లు, సి.పి.ఆర్ వాడకం గురించి క్షుణ్ణంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, డీఎమ్ అండ్ హెచ్.ఓ సుదర్శనం, అదనపు డీసీపీ ( ఎ.ఆర్ ) పి. గిరిరాజు పరిపాలన అధికారి జి.మధుసుధర్ రావు, నిజామాబాద్, బోధన్, ట్రాఫిక్, ఎఆర్ ఎమ్. కిరణ్ కుమార్, కె.ఎమ్. కిరణ్ కుమార్, టి. నారాయణ, ఎన్. సంతోష్ కుమార్, ఎ.ఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్లు , పోలీస్ కార్యాలయం సిబ్బంది, హోమ్ గార్డ్సు, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.