ప్రాచీన కాలం నాటి మెట్ల బావిని సందర్శించిన జిల్లా కలెక్టర్ పాటిల్

by Sridhar Babu |
ప్రాచీన కాలం నాటి మెట్ల బావిని సందర్శించిన జిల్లా కలెక్టర్ పాటిల్
X

దిశ,రాజంపేట్ (తాడ్వాయి ) : మండల కేంద్రంలోని ప్రాచీన కాలం నాటి 400 ఏళ్ల చరిత్ర కలిగిన మెట్ల బావిని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దోమకొండ సంస్థాన పాలకులు నిర్మించిన దొరగారి మెట్ల బావి శిథిలావస్థకు చేరుకోవడంతో

మళ్లీ పూర్వ వైభవం వచ్చేలా దాతల సహకారంతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ బావిలో పూడిక తీస్తే భూగర్భ జలాలు ఈ ప్రాంతంలో పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లను భవిష్యత్తు తరాలకు గుర్తుండేలా స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల ప్రతినిధులు, దాతలు, ప్రజా ప్రతినిధులు శ్రమదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట మండల అధికారులు,ఉన్నారు.

Advertisement

Next Story