అమ్మ ఆదర్శ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

by Kalyani |
అమ్మ ఆదర్శ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
X

దిశ, తాడ్వాయి : మండలంలోని ఎర్రపహడ్ ప్రభుత్వ పాఠశాలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సందర్శించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై అయన అరా తీశారు. త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, మరమత్తు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ మిగిలిన పనులను రేపటిలోగా పూర్తి చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 3.85 వేల ఖర్చుతో చేపట్టిన టాయిలెట్ బ్లాక్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, నల్లాలు, విద్యుద్దీకరణ, ఫాన్స్ ఏర్పాటు పనులను, ప్రాథమిక పాఠశాలలో రూ. లక్ష15 వేల ఖర్చుతో చేపట్టిన మౌలిక వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులు బుధవారంలోగా పూర్తి చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. మహిళా సమాఖ్య సభ్యులతో పనులు నాణ్యతతో చేపట్టారా అని వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ రహిమోద్దీన్, ఎంపిడిఓ సాజిద్ అలీ, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ వీరానంద్, ఎంఈఓ రామస్వామి, ప్రధానోపాధ్యాయులు సంగారెడ్డి, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed