మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ

by Sridhar Babu |   ( Updated:2023-10-03 18:22:07.0  )
మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ
X

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో మంగళవారం నిజాంసాగర్ మండలంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చేప పిల్లలను అందించారు. మాజీ సీడీసీ పట్లోళ్ల దుర్గారెడ్డి ఆధ్వర్యంలో మత్స్య కార్మికులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలో ఉన్న చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా మత్స్య శాఖ అధికారి కుంట్ల వరదా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్, చైర్మన్లు నరసింహారెడ్డి, గైని విట్టల్, యాటకారి నారాయణ, సత్యనారాయణ, రమేష్, దేవేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,గుల రాములు, గ్రామాల మత్స్యకారులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story