దిశ ఎఫెక్ట్...బాధితులకు లోన్ క్లియరెన్స్ ఇచ్చిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అధికార్లు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్...బాధితులకు లోన్ క్లియరెన్స్ ఇచ్చిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అధికార్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరం నడిబొడ్డున గల ఐడీడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లో లోన్ రికవరీ మేనేజర్ చేతివాటం అనే శీర్షికన దిశ దిన పత్రికలో శుక్రవారం వచ్చిన కథనంకు బ్యాంక్ ఉన్నతాధికారులు స్పందించారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్, విచారణ అధికారి సూర్యతో పాటు సెంట్రల్ ఆఫీస్ అధికారులు నిజామాబాద్ బ్రాంచ్ కు వచ్చారు. జరిగిన సంఘటన, అందుకు సంబంధించిన బాధితులను బ్యాంక్ కు పిలిపించారు. వారికి జరిగిన నష్టం, కష్టం ను గురించి స్వయంగా అడిగి తెలుసుకొన్నారు. అనంతరం బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును,

కేసును గురించి వాకబ్ చేశారు. బ్యాంక్ కు కస్టమర్లు ముఖ్యమని, బ్యాంక్ ద్వారా కస్టమర్లకు ఆర్థికంగా న్యాయం జరగాలి కానీ నష్టం వాటిళ్లకూడదాని చెప్పారు. బాధితులు నిందితుడు బ్యాంక్ రికవరీ మేనేజర్ దత్తుకు ఇచ్చిన నగదు డబ్బులు, వాటి తాలుకు ఆన్లైన్ ట్రాంజెక్షన్స్, ఫేక్ రిసీప్టులను పరిశీలించి వారి వారి టూ వీళ్ళర్ లోన్ల క్లీయరెన్స్( నో డ్యూ) సర్టిఫికెట్స్ ను బాధితులకు అందించారు. బ్యాంక్ లో పని చేస్తూ కస్టమర్లకు నష్టం చేయడమే కాకుండా సంస్థ కు చెడ్డ పేరు తేవాలని ప్రయత్నించి పరారీలో ఉన్న రికవరి మేనేజర్ దత్తు రెడ్డి పై సంస్థ తరపున లీగల్ గా క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని బ్యాంక్ ఉన్నాతాధికారులు తెలిపారు.

Next Story

Most Viewed