తెలంగాణ రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి

by Sridhar Babu |   ( Updated:2023-08-19 12:51:16.0  )
తెలంగాణ రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి
X

దిశ, బాన్సువాడ : తెలంగాణ రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం తాడ్కోల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మజీద్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనది లౌకిక దేశమని, అన్ని మతాలను, వారి సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని, దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవిస్తూ నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటుగా హామీ ఇవ్వని అనేక పథకాలను మంజూరు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1016 గురుకులాలు ఉండగా అందులో 204 మైనారిటీ లవి ఉన్నాయన్నారు. షాదీముబారక్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. మజీద్ ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రత్యేకంగా పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story