నకిలి పట్టాల కేసును అటకెక్కిస్తున్నారా ?

by Sumithra |
నకిలి పట్టాల కేసును అటకెక్కిస్తున్నారా ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన నకిలి పట్టాల కేసు దర్యాప్తు నెమ్మదించింది. పోలిస్ బాస్ అదేశాలతో రాకెట్ స్పీడ్ తో జరిగిన ఈ కేసు విచారణ, ఎప్ఐఆర్ నమోదు తరువాత వేగం తగ్గిపోయింది. నకిలి పట్టాలను తయారు చేసి బురిడి కొట్టించారని సీతారాం నగర్ కాలనీకి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలిస్ బాస్ అదేశాలతో టాస్క్ పోర్స్ ఈ కేసు విచారణ చెపట్టింది. మొత్తం 12 మందికి అందులో భాగస్వామ్యం ఉందని కేసు కట్టిన పోలిస్ లు ఇద్ధరిని అరెస్టు చేసి వారి వద్ధ నుంచి ముడు నకిలి పట్టాలను, స్టాంప్ లను స్వాధినం చేసుకున్న విషయం తెలిసిందే . ఈ కేసులో అరెస్టయిన ఇద్ధరు ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చారు. కాని కేసుమాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు ఈ కేసు విచారణ ఎమిటంటే సమాధానం చెప్పేవారు లేరు.

పోలిస్ శాఖ అధ్వర్యంలో నమోదైన ఈ కేసులో 12 మందిని పాత్రదారులుగా చూపించారు. అయితే నకిలి పట్టాలకు సబ్ రిజిస్ర్టార్ లకు సంబంధం ఎమిటనేది మిలియన్ డాలర్ ల ప్రశ్న. పోలిస్ లు నమోదు చేసిన కేసు ఎమో నకిలి ప్రభుత్వ భూములలో పేదలకు ఇచ్చే పట్టాలను పోర్జరి సంతకాలతో తయారిచేసి మోసం చేస్తున్నారని కావడం విశేషం. నిజామాబాద్ అర్బన్, రూరల్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలలో విధులు వెలగ బెట్టిన, ప్రస్తుతం ఉన్న ముగ్గురి సబ్ రిజిస్ర్టార్ లు వారికి సహకరించారని ఎప్ఐఆర్ లో నమోదు చేశారు.

కాని వారిని ఇప్పటి వరకు విచారించిన దాఖాలాలు లేవు. అదే మాదిరిగా కామారెడ్డిలో పనిచేస్తున్న తాహసీల్ధార్ ను సైతం ఇంకా విచారణకు పిలువలేదు. అదే విధంగా మోపాల్ లో పనిచేస్తున్న సర్వేయర్ ను కుడా విచారణకు పిలువలేదు. అధికారికంగా విచారణకు పిలువలేదు కాని అనధికారికంగా వారికి సమాచారం ఇవ్వడం మాట్లాడారని చర్చ జరుగుతుంది. పరారీలో ఉన్న ముగ్గురు సూత్రదారులతో పాటు కాంగ్రెస్ నేతను ఇప్పటికి విచారణను పిలువ లేదు. ఈ కేసులో సంబంధం ఉన్న డాక్యూమెంట్ రైటర్ లను, మీ సేవా కేంద్రాల నిర్వహకుల సంగతి ఎమిటి అనేది పోలిస్ లు తెల్చాలి.

నిజామాబాద్ టాస్క్ పోర్స్ పోలిస్ ల ఆధ్వర్యంలో విచారణ జరిగి, మూడవ టౌన్ పోలిస్ లు కేసునమోదు చేసిన నకిలి పట్టాలకేసులో ఉన్న గ్యాంగ్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. 2009 లో ఉమ్మడి రాష్ర్టంలో నిజామాబాద్ ఎమ్మార్వో కార్యాలయం దహనంలో పాత్రదారులు అనే వాదనలు ఉన్నాయి. ఆనాడు తహసీల్ కార్యాలయంలో రికార్డులు తగలబెట్టిన వారే నిజామాబాద్ పాత మండలం పరిధిలో భూమాఫియాగా తయారై రికార్డులు లేని భూముల గాయబ్ కు సూత్రదారులు అనేవాదనలు లేకపోలేదు.

నిజామాబాద్ నగరంలో నకిలి పట్టాల కేసులో సూత్రదారుల పేరులో పోలిస్ అధికారులు ఎఫ్ఐఆర్ లో నమోదు కాగానే గాయబ్ అయ్యారు. కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఒక మాజీ అధికారి సహయంతో కేసునుంచి బయటపడే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఇటివల జరిగిన ఒక సార్ బర్త్ డే కు నకిలి పట్టాల గ్యాంగ్ సభ్యులు రూ.2.5 లక్షలు ఖర్చు తో హంగామాగా చేసారు అని వినికిడి. పోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్ లు చేసి ఓక్కో ప్రాపర్టిని డబుల్ రిజిస్ర్టేషన్ చేసిన వారు బర్త్ డే పోటోలను, విడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయ్యగా అవి వైరల్ అయ్యాయి.
ఇక పోలిస్ శాఖ అధికారులు సైతం కేసు సంగతి దేవుడు ఎరుగు కాని పటాస్ సినిమాలో కళ్యాణ్ రాం మాధిరిగా ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని విచారణ పేరుతో పిలువడం పిండడం చేస్తున్నారనే టాక్ జోరందుకుంది. అందుకే నకిలి పట్టాల కేసు నమోదైన వారిపై పలు పోలిస్ స్టేషన్లలో కోత్తగా పిర్యాదులు నమోదైన వారిని పేరంటాలకు పిలిచినట్లు మర్యాధలు చేస్తున్నారే గాని విచారణ జరుపడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేసు ధర్యాప్తును అంతగా సిరియస్ గా తీసుకోలేదని చర్చ జరగుతుంది.

Advertisement

Next Story

Most Viewed