అహంకారాన్ని ఓడించి.. ఆత్మగౌరవాన్ని గెలిపించండి....

by Sridhar Babu |
అహంకారాన్ని ఓడించి.. ఆత్మగౌరవాన్ని గెలిపించండి....
X

దిశ, ఆర్మూర్ : అహంకారాన్ని ఓడించి.. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించుకోండని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గం లోని బాల్కొండ మండలం వన్నెల్ బి, ముప్కాల్ మండల కేంద్రం, కొత్తపల్లి గ్రామాలలో బుధవారం రాత్రి సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరు చెప్పి రైతులకు రావాల్సిన అన్ని వ్యవసాయ పరికరాలను, విత్తనాలను సబ్సిడీలను రాకుండా మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం 15000 లకు పెంచుతామని తెలిపారు. అలాగే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, భూమి లేని ఉపాధి కూలీలకు సంవత్సరానికి 12000, ప్రభుత్వం వచ్చిన తొలి యాడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. ఈ సారి కాంగ్రెస్ పార్టికి అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story