బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌ హతురసింఘ‌‌పై వేటు

by Harish |
బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌ హతురసింఘ‌‌పై వేటు
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చండికా హతురసింఘ‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) వేటు వేసింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా అతనితో చేసుకున్న ఒప్పందాన్ని మంగళవారం రద్దు చేసింది. హతురసింఘను తొలగించడానికి గల కారణాలను బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ వెల్లడించాడు. ‘ఓ ఆటగాడిపై దాడి చేశాడు. అలాగే, ఒప్పందంలో అనుమతించిన దానికంటే ఎక్కువ సెలవులు తీసుకున్నాడు.’ అని చెప్పాడు. భారత్ పర్యటన ముగిసిన వెంటనే హతురసింఘపై వేటు వేయడం గమనార్హం. భారత గడ్డపై బంగ్లా జట్టు టెస్టు, టీ20 సిరీస్‌లను కోల్పోయిన విషయం తెలిసిందే. బంగ్లా జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫిల్ సిమ్మన్స్‌ను బీసీబీ నియమించింది. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ వరకు అతను ఆ బాధ్యతలో ఉంటాడు. సిమ్మన్స్ గతంలో జింబాబ్వే, అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌ జట్లుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ నెలలో సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌తో సిమ్మన్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

Advertisement

Next Story