ఇంకా ఎన్ని రోజులు..?

by Naveena |
ఇంకా ఎన్ని రోజులు..?
X

దిశ,చిలుకూరు: చిలుకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ కూలి రెండు నెలలవుతున్నా..పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆరోగ్యం కేంద్రం పక్కనే ఉన్న అంతర గంగలో భారీ స్థాయిలో వరద నీరు ప్రవహించింది. దీంతో కొత్త, పాత చిలుకూరు మధ్య రాకపోకల అంతరాయం ఏర్పడింది. దాంతోపాటు వరద ప్రవాహం ఆరోగ్య కేంద్రాన్ని చుట్టుముట్టి ప్రహరీని ధ్వంసం చేసింది. వరద నీరు ఆరోగ్య కేంద్రంలో చేరి ఆరోగ్య సంబంధ పలు పరికరాలు, మందులు, ఫర్నిచర్ ను నీట ముంచాయి. డీఎంహెచ్వో కోటచలం పరిస్థితి పరిశీలించి..నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కూలిన ప్రహరీని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. అయినా రెండు నెలలవుతున్నా నేటికీ ప్రహరీని పునఃనిర్మించలేదు. దీంతో పీహెచ్సీకి రాత్రి వేళ రక్షణ కరవైంది. పశువులు చేరి అక్కడి మొక్కలను ధ్వంసం చేస్తూ ఆరోగ్య కేంద్రం ఆవరణను అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రహరీని నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed