Collector : డ్యూయల్ డెస్క్ లను వీలైనంత త్వరగా పాఠశాలలకు అందించాలి

by Kalyani |
Collector : డ్యూయల్ డెస్క్ లను వీలైనంత త్వరగా పాఠశాలలకు అందించాలి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలకు అందించవలసిన డ్యూయల్ డెస్క్ లను వీలైనంత త్వరగా తయారు చేసి ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. చంచల్ గూడ జైలు ఆవరణలోని డ్యూయల్ డెస్క్ తయారీ కేంద్రం ను కలెక్టర్ సందర్శించి అక్కడ తయారవుతున్న డ్యూయల్ డెస్క్ లను పరిశీలించారు. డ్యూయల్ డెస్క్ లు ఆర్డర్ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఎందుకు అందజేయడం లేదని, ఇప్పటివరకు ఎన్ని సరఫరా చేశారని, ఇంకా ఎన్ని చేయవలసి ఉంది, ఎప్పటి వరకు పూర్తి చేస్తారని అడిగి తెలుసుకున్నారు. జాప్యం లేకుండా నాణ్యతతో కూడిన డ్యూయల్ డెస్క్ లను తయారు చేసి త్వరగా పాఠశాలలకు అందజేయాలని అధికారులను, కాంట్రాక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. వీటిని క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెక్ చేసిన తర్వాత పాఠశాల హెచ్ఎంలు తీసుకోవాలని సూచించారు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని ఆయన తెలిపారు. ప్రతి ప్రోడక్ట్ ను నిబంధన ప్రకారం ఉన్నాయా అనేది చూసుకోవాలన్నారు. ప్రతిరోజు డ్యూయల్ డెస్క్ లు ఎన్ని తయారవుతున్నాయి అనేది గూగుల్ షీట్ లో నమోదు చేయాలన్నారు.

ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యత ఇచ్చి అట్టి పాఠశాలలకు డ్యూయల్ డెస్కులను త్వరగా పంపాలని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి సందర్శించారు. కళాశాల ఆవరణలో రూ 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ ను, కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్లోరింగ్, కిటికీలు తదితర ఏర్పాట్లు త్వరగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో చంచల్ గూడ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ నవాబ్ శివ కుమార్ గౌడ్, ఈ ఈ షఫీమియా, ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, విద్యా శాఖ కోఆర్డినేటర్ రజిత, దేవుల నాయక్, లెక్చరర్లు ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed