ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

by Sridhar Babu |
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : జిల్లా పరిధిలోని బాలానగర్ నుంచి అడ్డాకల్ వరకు ఉన్న నేషనల్ హైవే-44 పై నిత్యం జరుగుతున్న ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ జానకి ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ఆమె మంగళవారం నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి జాతీయ రహదారి 44 పై యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా అతివేగంగా ప్రయాణించే వాహనాలను సీసీ టీవీల ద్వారా గుర్తించి జరిమానాలు వేయాలని, ప్రమాద మలుపులు, స్కూల్ జోన్, రోడ్డు మరమ్మతుల వద్ద హెచ్చరిక బోర్డులు, సిగ్నలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

సీటు బెల్టు,హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించాలని కోరారు. డ్రైవర్లకు అవగాహన కల్పించడం, హైవేలపై మెడికల్ సెంటర్ ,వైద్య సేవలు, అంబులెన్స్ సర్వీస్ లాంటి వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్లపై గుంతలను పూడ్చాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, జడ్చర్ల సీఐ లు ఆదిరెడ్డి, నాగార్జున తదితర అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed