విద్యార్థిని మృతి.. ఎస్సై, సీఐ, డీఎస్పీ, ఆర్‌డీఓ విచారణ

by Anjali |   ( Updated:2023-11-01 02:49:43.0  )
విద్యార్థిని మృతి.. ఎస్సై, సీఐ, డీఎస్పీ, ఆర్‌డీఓ విచారణ
X

దిశ, బిచ్కుంద: కామారెడ్డి జిల్లా, మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామపంచాయతీ పరిధిలోని గేటు వద్ద గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో మంగళవారం ఉదయం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకునే వసుధ అనే విద్యార్తిని చనిపపోయిన విషయం తెలిసిందే. గ్రామం మానేపూర్ మండలం బిచ్కుంద మోనోటరి బ్లాక్ గదిలో ఒక ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు పెద్ద ఎత్తున కళాశాలకు తరలివచ్చి ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థి మృతికి కళాశాల ప్రిన్సిపాల్ ఏ కారణం అంటూ ఆందోళన చేశారు. విద్యార్థిని మృతి పట్ల బాన్సువాడ డి.ఎస్.పి బాన్సువాడ ఆర్డిఓ బిచ్కుంద సీఐ మద్నూర్ ఎస్సై విచారణ చేపడుతున్నమన్నారు. మృతికి కారణాలు తెలిపే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థిని బంధువులు తల్లిదండ్రులు తెలిపారు.

Advertisement

Next Story