కంచలేని ట్రాన్స్ ఫార్మర్లు.. పొంచి ఉన్న ప్రమాదాలు..

by Sumithra |
కంచలేని ట్రాన్స్ ఫార్మర్లు.. పొంచి ఉన్న ప్రమాదాలు..
X

దిశ, తాడ్వాయి : మండల కేంద్రంలోని చిట్యాల తాడ్వాయి మార్గం గుండా నిత్యం ఎంతో మంది వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతే కాదు మండల కార్యాలయానికి వెళ్లాలన్నా ఈ మార్గం గుండానే వెళ్లాల్సిన పరిస్థితి. ఈ మార్గంలో ఎలాంటి భద్రతా చర్యలు, చూట్టూ కంచె ఏర్పాటు చేయకుండా ట్రాన్స్ పార్మర్ ఉండడంతో ప్రమాదం పొంచి ఉందని వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు.

తక్షణమే ట్రాన్స్ పార్మర్ చుట్టూ కంచే ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ నిమిషంలో అయినా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నపటికీ విద్యుత్ శాఖ అధికారులు పట్టనట్టు ఉండడం పై ప్రజలు మండిపడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ట్రాన్సపార్మర్ కు కంచెను ఏర్పాటు చెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story